Monday, December 23, 2024

విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారనే ప్రచారం అవాస్తవం: డిహెచ్ గడల శ్రీనివాస్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తరుచుగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం చేసుకునే డైరెక్టర్ ఆప్ హెల్త్ గడల శ్రీనివాస్‌రావు ఇటీవల కొత్తగూడెం వెళ్లి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటన చేయడంతో రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ సాగింది. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని అందుకు వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని శ్రీనివాస్‌రావు వెల్లడించారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా ప్రజలకు తెలియజేస్తానని ప్రజా సేవ చేయడానికి నా వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తున్నట్లు తెలిపారు. అందరూ కోరుకుంటున్నట్టుగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే తప్పకుండా ఆయన ఆదేశాలను పాటిస్తానని పేర్కొన్నారు. అప్పటివరకు తనపై అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News