Monday, December 23, 2024

సమాజాభివృద్ధికి ప్రాధాన్యమైన పాత్ర టీచర్లదే

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరో : పిల్లల సర్వతోముఖాభివృద్ధికి టీచర్లు కీలక పాత్ర వహిస్తారని, ఆరోగ్యవంతమైన సమాజానికి అంగన్‌వాడీ టీచర్లు కీలక పాత్ర వహిస్తున్నారని జయంతి అన్నారు. శనివారం జయ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కోశాధికారి వంపు జార్జి బిఎస్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆట వస్తువులు, చదువు పరికరాలను, గర్భిణులకు ఉపయోగపడే వేయింగ్ మిషన్‌ను అందించారు. 18 సంవత్సరాల పాటు సెయింట్ థామస్ ఎస్పీజీ బాయ్స్ స్కూల్లో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఫెయిత్ నిర్మల, ఇదే పాఠశాలలో పిటి మాస్టర్‌గా చక్కటి క్రీడాకారులను తయారుచేసిన జయచంద్రన్ దంపతుల సంస్మరణార్థం సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారి కూతురైన జయంతి తెలిపారు.

విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించి విద్యార్థులను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా అవకాశం ఉన్న అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా చిన్నారుల ఎదిగే వయసు నుండి వారికి సరైన దిశా నిర్దేశం అందించేందుకు కృషి చేయాలని అందుకు అంగన్వాడీ టీచర్లు గొప్ప పాత్ర వహిస్తున్నారని కొనియాడారు. అంగన్వాడీ టీచర్లు శ్రీదేవి స్వప్న సరిత షాహిన్ అనురాధ ఐసిడిఎస్ కీర్తి సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News