Wednesday, January 22, 2025

హత్రాస్ జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమంపై మృత్యు పంజా

- Advertisement -
- Advertisement -

తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తులు

మృతుల్లో 23 మంది మహిళలు, ఒక చిన్నారి

హత్రాస్: ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. హత్రాస్ జిల్లాలోని రతిభాన్పూర్ లో జరిగిన శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 27 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 23 మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 15 మందికి  పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎటా ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సిఎం ఆదిత్యనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు, హత్రాస్ ఘటనపై సమాచారం అందిన వెంటనే సీఎం ఆదిత్యనాథ్ ఇద్దరు మంత్రులను, డిజిపిని సంఘటన స్థలానికి పంపించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఆగ్రా అడిషనల్ డిజిపి, అలీగఢ్ పోలీస్ కమిషనర్ లతో ఓ కమిటీని నియమించారు.

Hatras 3

Hatras 2

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News