Monday, December 23, 2024

హరితహారం స్ఫూర్తితో విరివిగా మొక్కలు నాటాలి

- Advertisement -
- Advertisement -
హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ హనుమంతరావు

హైదరాబాద్: హరితహారం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ విరివిగా మొక్కలు నాటాలని హనుమంతరావు, కమిషనర్ (ఐఏఎస్), హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు మొక్కల పెంపకం వాటి ఉపయోగాలను ప్రజలకు తెలియచెప్పాలని ఆయన సూచించారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం టిఎన్జీఓ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ మజీదుల్లా హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ యూనిట్‌లో హరితహారం కార్యక్రమం ఉద్యోగుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈకార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముజీబ్‌హుస్సేనీ మాట్లాడుతూ సిఎం కెసిఆర్, రాజ్యసభ ఎంపి సంతోష్‌కుమార్‌లు ఇచ్చిన స్పూర్తితోనే తాము ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సరోజినీ దేవి, జాయింట్ డైరెక్టర్, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్, శ్రీనివాసరావు, వ్యవస్థాపకులు, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్, జిల్లా కార్యవర్గ సభ్యులు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమం తర్వాత పబ్లిక్ గార్డెన్ నుంచి అమరవీరుల స్థూపం వరకు పాదయాత్రగా వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News