హైదరాబాద్: శతాబ్ధాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కంచారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ ఉందని ఆమె తెలిపారు. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని ఆమె పేర్కొన్నారు. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారన్నారు.
రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని ఆమె వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ అంటే తనకు ఇష్టమని తెలంగాణ అభ్యుదయంలో తన పాత్ర ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. నాకు తెలంగాణ వాళ్లంటే ఇష్టం, అందుకే ఎంత కష్టమైనా పని చేస్తానని గవర్నర్ తెలిపారు. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయరచయిత చంద్రబోస్, సివిల్స్ శిక్షకురాలు బాలలత, టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ఆమె తరఫున వారి తల్లిదండ్రులు, ఎన్జీఓ భగవాన్, మహవీర్ వికలాంగ సహాయతా సమితి ప్రతినిధులు, పారా అథ్లెట్ లోకేశ్వరితో పాటు పలువురిని గవర్నర్ తమిళిసై సన్మానించారు.
అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమర జవాన్ల స్థూపం వద్ద గవర్నర్ నివాళులర్పించి అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.