Monday, January 20, 2025

అకోలా హింసకు ప్రేరేపించిన అర్బాజ్ ఖాన్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

అకోలా :మహారాష్ట్రలోని అకోలాలో ముస్లింలను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించారన్న నేరారోపణపై సూత్రధారి అర్బాజ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీఎఫ్‌ఎక్స్ రెండో సంవత్సరం చదువుతున్న అర్బాజ్ మహమ్మద్ ప్రవక్తపై ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వివాదాస్పదం కావడంతో హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. 8 మంది గాయపడ్డారు. ఆ పోస్టును సర్కులేట్ చేయడంతో రామ్‌దాస్ పేట పోలీస్‌స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో జనం వచ్చేలా చేశాడని పోలీస్‌లు పేర్కొన్నారు.

ఈ హింసాత్మక సంఘటనకు సంబంధించి 150 మంది అరెస్ట్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్‌ను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసినందుకు అర్బాజ్ ఖాన్‌ను అదుపు లోకి తీసుకున్నామని అకోలా ఎస్పీ సందీప్ గుగే తెలిపారు. ద కేరళ స్టోరీ చిత్రం చూసిన సమీర్ నోనావానే అనే వ్యక్తి ఆ ఫిల్మ్‌కు అనుకూలంగా ఓ పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్ విషయంలో ఆగ్రహంతో ఉన్న అర్బాజ్ ఆ వ్యక్తితో చాటింగ్ చేశాడు. ఆ తర్వాత చాటింగ్‌ను ఎడిట్ చేసి తన ఇన్‌స్టా లో పోస్టు చేశాడు. దీంతో ఆ పోస్ట్ వైరల్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News