Sunday, December 22, 2024

అధికారులలో సిఎం కెసిఆర్ సమీక్ష.. పట్టాల పంపిణీపై త్వరలో తేదీ ప్రకటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. మంగళవారం సిఎం కెసిఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…. ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. క్లస్టర్ల వారీగా సర్వే చేయించి పంట నష్టం వివరాలు అందించాలని సూచించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని అధికారులకు తెలిపారు. జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు చేపట్టాలని ఆదేశించారు. సొంత స్థలం ఉన్నవారికి రూ.3లక్షల ఆర్థిక సాయం అందించాలని సూచించారు. గృహలక్ష్మి పథకానికి విధివిధానాలను రూపొందించాలన్నారు. పోడుభూముల పట్టాల పంపిణీ కోసం త్వరలో తేదీ ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రభుత్వం తరుపున భద్రాద్రి సీతరాముల కల్యాణ నిర్వహణకు రూ. కోటి మంజూరు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News