Tuesday, April 8, 2025

అమానవీయం.. కడుపుతో ఉన్న భార్యను సిమెంట్ ఇటుకతో..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆమె తన భార్య.. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు.. పైగా ఆమె కడపుతో ఉంది.. ఆయినా కూడా కనికరించలేదు ఆ భర్త. సిమెంట్ ఇటుకతో కొట్టి ఆమెను హతమార్చాలని ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. హఫీజ్‌పేట్‌కి చెందిన మహ్మద్ బస్‌రత్(32), అజ్‌మేర బాబా దర్గాకి వెళ్తుండగా.. బస్సులో షబానా పర్వీన్‌(22)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2024 అక్టోబర్‌లో వీరికి వివాహం జరిగింది.

అయితే పెళ్లైన కొన్నాళ్లకే షబనా ఒత్తిడి మేరకు వేరు కాపురం పెట్టారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో షబనా గర్భం దాల్చింది. అయితే రెండు నెలల గర్భంతో ఉండగా.. ఆమెకు వాంతులు కావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించాడు. ఏప్రిల్ 1వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఆమె డిశ్చారి చేశాక.. మళ్లీ ఇద్దరు గొడవపడ్డారు. దీంతో కోపంతో బస్‌రత్ ఆమెపై ఇష్టారీతిన దాడి చేశాడు. రోడ్డు మీద పడేసి.. సిమెంట్ ఇటుకతో తలపై పలుమార్లు మోదాడు. ఆమె చనిపోయి ఉంటుందని.. పారిపోయాడు. సమాచారం అందుకొని ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌లో ఉంచారు. తలపై తీవ్రమైన గాయం కావడం షబనా కోమాలోకి వెళ్లిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News