Thursday, January 23, 2025

అమెరికాలో మైనస్ 46డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత…విపరీతమైన చలి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో చ‌లి చంపేస్తోంది. అక్క‌డ ఉష్ణోగ్ర‌త్త‌లు తీవ్రంగా ప‌డిపోయాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా క‌నిష్ట స్థాయిలో టెంప‌రేచ‌ర్లు న‌మోదు అవుతున్నాయి. న్యూ హ్యాంప్‌షైర్,  మౌంట్ వాషింగ్ట‌న్‌లో చ‌లి గాలులు విప‌రీతంగా ఉన్నాయి.

న్యూయార్క్ రాష్ట్రంలో అతిశీతల గాలులు వీస్తున్నాయి. ‘విండ్ చిల్ వార్నింగ్’ జారీ చేశారు. మ‌సాచుసెట్స్‌, క‌న‌క్టిక‌ట్‌, రోడ్ ఐలాండ్‌, న్యూహ్యాంప్‌షైర్‌, వెర్మోంట్‌, మెయిన్ రాష్ట్ర‌ల్లో ఉన్న సుమారు 1.6 కోట్ల మంది చ‌లికి వ‌ణికిపోతున్నారు. మౌంట్ వాషింగ్ట‌న్ ప్రాంతంలో మైన‌స్ 46 డిగ్రీలు న‌మోదు అయిన‌ట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంచు గడ్డకట్టే  పరిస్థితులు మ‌రికొన్ని రోజులు ఉంటాయ‌ని, ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణం ప్రాణాంత‌కంగానే ఉన్న‌ట్లు వాతావరణ శాఖ వెల్ల‌డించింది. బోస్ట‌న్‌, వార్‌సెస్ట‌ర్‌, మ‌సాచుసెట్స్‌, న్యూ ఇంగ్లాండ్ లాంటి ప‌ట్ట‌ణాల్లో స్కూళ్ల‌ను మూసివేశారు. హైపోథ‌ర్మియా, ఫ్రోస్ట్‌బైట్ నుంచి త‌ప్పించుకునేందుకు ముందస్తుగా ఈ చ‌ర్య‌లు చేప‌ట్టారు. కాగా బోస్ట‌న్ మేయ‌ర్ ఎమ‌ర్జెన్సీ వార్నింగ్ సంకేతాలు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News