Monday, December 23, 2024

ఆఫీసుకు రాకుంటే ఇక ఇంటికే..

- Advertisement -
- Advertisement -

కాలిఫోర్నియా: కరోనా సమయంలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ వాతావరణంనుంచి ఇంకా కొంతమంది ఉద్యోగులు బైటికి రావడం లేదు. వారంలో మూడు రోజులు ఆఫీసులకు వచ్చి పని చేయాలని చాలా కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులకు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. దాదాపుగా అన్ని కంపెనీల్లోను ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంస్థ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. వారంలో మూడుఏ రోజులు ఆఫీసుకు వచ్చి తీరాలని సూచించింది. ఒకవేళ ఈ నియమావళిని ఉల్లంఘిస్తే ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.సెప్టెంబర్ 5నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసులకు వచ్చి పని చేయాల్సిందేనని ఉద్యోగులకు జారీ చేసిన నోటీసులో మెటా పేర్కొంది.

ఒక వేళ పదేపదే నియమావళిని ఉల్లంఘించే ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నదీ లేనిది తనిఖీ చేయాలని మేనేజర్లను ఆదేశించింది. ఉద్యోగుల మధ్య బంధాలకు, టీమ్‌వర్క్‌కు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆ నోటీసులో పేర్కొంది. అయితే ఈ నిబంధననుంచి రిమోట్ ఉద్యోగులను మెటా మినహాయించింది.‘ ఆఫీసులో ఉంటూ పని చేస్తేనే మంచి పురోగతి సాధించగలుగుతాం. ఇంట్లో ఉంటూ వర్క్ చేసే వారికన్నా ఆఫీసుకు వచ్చి పని చేసే వారే మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు’ అని జుకర్‌బర్గ్ గతంలోనే ఓ సందర్భంలో ఉద్యోగులతో అన్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News