Wednesday, January 22, 2025

ఆస్పత్రిలో చేరిన దీపిక పదుకొణె

- Advertisement -
- Advertisement -

Deepika Padukone

హైదరాబాద్:  బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె ఆస్పత్రిలో చేరారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హార్ట్‌బీట్‌ పెరగడంతో హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్య బృందం ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’  చిత్రంలో దీపిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. షూటింగ్‌లో ఉండగా ఒక్కసారిగా ఆమె హార్ట్‌రేట్‌ పెరగడంతో కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో సోమవారం డిశ్చార్జ్ చేసి, నోవాలెట్‌ హోటల్‌లో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ప్రభాస్‌ సరసన దీపికా పడుకొణె నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News