- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : నేటి సాయంత్రం 4:30 నుండి 6.15 గంటల వరకు ఉస్మానియా టివి ద్వారా ‘చంద్రయాన్- 3’ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. లైవ్ సెషన్ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుందని, చంద్రయాన్ విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత సాయంత్రం 6.15 గంటలకు ముగుస్తుందని ఉస్మానియా యూనివర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా లైవ్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశామని, బృంద చర్చలో శశికాంత్ సాల్వి, ఆపరేషన్స్ డైరెక్టర్ (రిటైర్డ్), ఎన్‌ఆర్‌ఎస్‌సి హైదరాబాద్, ఎన్. రఘునందన్ కుమార్, డైరెక్టర్, ప్లానెటరీ సొసైటీ, ఇండియా, ప్రొఫెసర్. పి. నవీన్ కుమార్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం, నోడల్ ఆఫీసర్ (ఇస్తో ఓయూ ) , డాక్టర్ కె. చెన్నా రెడ్డి, ఉస్మానియా ఖగోళ శాస్త్ర విభాగ అధ్యాపకులు పాల్గొంటారని వెల్లడించింది.
- Advertisement -