Sunday, December 22, 2024

ఎగ్జిట్ పోల్స్: హర్యానాలో హస్తం… కశ్మీర్‌లో హంగ్

- Advertisement -
- Advertisement -

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు,

జమ్మూకశ్మీర్‌లో కమలానికి ఆర్టికల్ 370రద్దు కలిసి రానట్టే,

8న ఎన్నికల ఫలితాలు
హర్యానాలో 65శాతం ఓటింగ్ నమోదు

న్యూఢిల్లీ : హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు శనివారం సాయంత్రం వెలువడ్డాయి. బిజెపికి హర్యానాలో భారీ షాక్ తగిలింది. ఇక కశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడనుందని పలు సర్వే సంస్థలు జరిపిన విశ్లేషణలో స్పష్టం అయింది. హర్యానాలో పది సంవత్సరాలుగా బిజెపి అధికారంలో ఉంది.

Congress win in Haryana assembly electionsCongress win in Haryana assembly elections

90 అసెంబ్లీ స్థానాల హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ మొత్తం మీద 40 నుంచి 55 స్థానాలను గెల్చుకునే అవకాశం ఉందని వివిధ సర్వే సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్, వీటిని ప్రాతిపదికగా చేసుకుని వెలువడ్డ సగటు సీట్ల ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం సునాయాసంగా ఏర్పడేందుకు వీలుంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో హర్యానాలో కాంగ్రెస్ వేవ్ బలీయంగా ఉందని వెల్లడైంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలపై విమర్శలు, చలో ఢిల్లీకి హర్యానా కేంద్ర బిందువు కావడం, ఇటీవలే రెజ్లర్లు కాంగ్రెస్‌లో చేరడం వంటి కీలక పరిణామాలు, ప్ర త్యేకించి ఇక్కడ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపిపై స గటు జనం అధికార వ్యతిరేకత వంటి పరిణామాలు బిజెపికి షాక్ ఇచ్చాయి. ఇక హర్యానాలో ఈసారి చక్రం తిప్పగలమని ధీమాతో ఉన్న ఆమ్ ఆద్మీపార్టీ ఖాతా తెరుచుకునే పరిస్థితి లేదని విశ్లేషణలతో వెల్లడైంది.

జమ్మూ కశ్మీర్‌లో హంగ్ ..ఎగ్జిట్ పోల్ ఫలితాలు

ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కశ్మీర్‌లో తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. 90 స్థానాల జమ్మూ కశ్మీర్‌లో పదేళ్ల తరువాత కీలక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఏ పార్టీకి ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన మెజార్టీ రాకపోవచ్చునని ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్పష్టం అయింది. దీనితో ఈ కీలక రాష్ట్రంలో హంగ్ పరిస్థితి ఉత్కంఠతకు దారితీసింది.

అయితే ఇక్కడ జట్టు కట్టిన కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా సారధ్యపు నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి అన్నింటి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. అయితే ఇక్కడ ఈ పార్టీ సొంతంగా ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన మెజార్టీ పొందలేదని తేల్చారు. బిజెపికి కనీసం 20 , ఎక్కువలో ఎక్కువ 32 స్థానాలు వస్తాయని వెల్లడైంది. ఇక మాజీ సిఎం మెహబూబా ముఫ్తీకి చెందిన పిడిపి సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని కొన్ని సర్వే సం స్థలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన సంఖ్యాబలం 46. కాంగ్రెస్ ఎన్‌సి కూటమి ఈ స్థానాల బలం దక్కించుకోకపోవచ్చునని మొత్తం మీద తేల్చారు. అయితే పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఈ కూటమికి 46 50 వరకూ సీట్లు రావచ్చునని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News