- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లోని యువతకు ఎన్నికల పట్ల నిరాసక్తత ఉంది. 40 శాతం కంటే తక్కువ మందే ఓట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బీహార్, ఢిల్లీ, యూపి లలో ముప్పావు కంటే తక్కువ మందే యువకులు ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసి ఎన్నిక తేదీలను పక్షం రోజుల కిందటే ప్రకటించింది.
తొలిసారి ఓటరుగా నమోదు చేసుకున్న యువత కేవలం 38 శాతం మందే. 18-19 ఏళ్ల వయస్సు గల ఓటర్లు తెలంగాణలో ఎనిమిది లక్షల మంది(66.7 శాతం). తెలంగాణనే ఈ వయస్సు ఓటర్లు అత్యధికం. కాగా బీహార్ లో 9.3 లక్షలు (17 శాతం) మంది యువతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
- Advertisement -