Monday, November 18, 2024

ఎన్‌సిబి కస్టడీకి ఆర్యన్, మరో ఇద్దరు

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: క్రూయీజ్ నౌకలో మాదకద్రవాలతో పట్టుకున్న కేసులో నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ సేఠ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచను అక్టోబర్ 4 వరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) కస్టడీకి కోర్టు అప్పగించింది. ఎన్‌సిబి తరఫు న్యాయవాది అద్వైత్ సేథనా దర్యాప్తు నిమిత్తం నిందితులను రెండు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరారు.
ఆర్యన్ ఖాన్‌ను నిర్వాహకులు క్రూయీజ్‌పైకి ఆహ్వానించారని అతడు తరఫు న్యాయవాది సతీశ్ మనెషిండే వాదించారు. ఆర్యన్ నుంచి ఎలాంటి నిషిద్ధ పదార్థాన్ని కూడా వారు స్వాధీనం చేసుకోలేదన్నారు. పైగా అతడు డ్రగ్స్ సేవించినట్లు సాక్షాలు కూడా లేవని వాదించారు. ఆర్యన్ బెయిల్‌కు అప్లయ్ చేస్తానని తెలిపారు.
ఎన్‌సిబి మెమో ప్రకారం 13 గ్రాముల కొకైన్, 5గ్రాముల ఎండి, 21 గ్రాముల చరాస్, 22 ఎస్కటసీ మాత్రలు, రూ. 1.33 లక్షల రొక్కాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ ఉదంతంతో తమకేమి సంబంధంలేదు అని క్రూయీజ్ కంపెనీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News