Friday, December 20, 2024

ఎలిజబెత్- ఇండియా బంధం

- Advertisement -
- Advertisement -

India is a special favorite of Queen Elizabeth

వైవిధ్య భారత్‌కు సలాం అన్న క్వీన్
జలియన్‌వాలా స్మారక స్థలి సందర్శన
చరిత్రలోని క్లిష్ట అంశాల పట్ల విచారం
మూడుసార్లు భారతలో పర్యటన

లండన్ : బ్రిటన్‌కు సుదీర్ఘకాలం రాణిగా ఉంటూ తమ 96వ ఏట కన్నుమూసిన క్వీన్ ఎలిజబెత్‌కు భారతదేశం అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. వైవిధ్యం, బహుముఖ సుసంపన్నత భారతదేశానికి ప్రత్యేక లక్షణాలు అని ఆమె కొనియాడేవారు. బ్రిటన్ వలసపాలన నుంచి భారతదేశం విముక్తి పొంది , స్వాతంత్య్ర దేశంగా అవతరించిన తరువాత 1952లో బ్రిటన్‌కు రాణిగా ఆమె పట్టాభిషుక్తురాలయ్యారు. తమ జీవితకాలంలో ఆమె భారత్‌లో మూడుసార్లు అధికార పర్యటన జరిపారు. 1961, 1983, 1997లో క్వీన్ ఎలిజబెత్ భారత పర్యటన సాగింది. భారతీయుల సాదర ఆతిధ్యం, వారి ఆత్మీయతహ హలను తనను కదిలించివేశాయని ఓ దశలో ఆమె ఓ ప్రసంగంలో పేర్కొన్నారు. బహు భాషాత్వం, విభిన్న ఆచార వ్యవహారాల వైవిధ్యత భారతదేశాన్ని సుసంపన్నం చేసింది. ఈ కోణంలో భారతదేశం ప్రపంచానికి మన అందరికీ స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు.

1961లో ఆమె తన భర్త , డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ దివంగత ప్రిన్స్ ఫిలిప్‌తో కలిసి భారతదేశానికి వచ్చినప్పుడు ముంబై, చెన్నై, కొల్‌కతాలను సందర్శించారు. జనం జీవనసరళిని అధ్యయనం చేసే ప్రయత్నం చేశారు. ఆగ్రాలో తాజ్‌మహల్‌ను రాజదంపతులు తిలకించి వెళ్లారు. దేశ రాజధాని ఢిల్లీలో రాజ్‌ఘాట్‌కు వెళ్లి భారత జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. 1983లో కామన్‌వెల్తు దేశాల ప్రభుత్వాధినేత సమావేశం (చోగమ్) నేపథ్యంలో ఆమె భారత్‌కు వచ్చివెళ్లారు. అప్పట్లోనే మదర్ థెరెసాకు విశిష్ట గౌరవ పురస్కారం ప్రకటించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజదంపతులు భారత్ ఆహ్వానంపై గణతంత్ర దినోత్సవానికి గౌరవ అతిధులుగా వచ్చారు. రామ్‌లీలా మైదాన్‌లో కిక్కిరిసిన ప్రజలను ఉద్ధేశించి ఆమె ఉన్ని కోట్, హాట్‌తో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తి అయిన దశలో క్వీన్ ఎలిజబెత్ భారత్‌లో జరిపిన పర్యటన దేశంలో ఆమె జరిపిన చివరి పర్యటన అయింది.

బ్రిటన్ వలసపాలనకు సంబంధించి పలు క్లిష్ట అంశాలను ఈ నేపథ్యంలో అప్పుడు ఆమె తొలిసారిగా ప్రస్తావించారు. గతానికి సంబంధించి కొన్ని ఇబ్బందికర అంశాలు, చరిత్రకు సంబంధించి వివాదాస్పద అధ్యాయాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. జలియన్‌వాలా బాగ్ ఘట్టం ఈ దిశలో చాలా బాధాకరమైన ఉదాహరణగా ఉంటుందని తెలిపారు. భర్త ఫిలిప్‌తో కలిసి క్వీన్ అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ మారణకాండ స్మారక స్థలికి వెళ్లి అక్కడ పుష్ఫగుచ్ఛాలు ఉంచారు. బ్రిటిష్ పాలకుల దశలో, 1912లో అప్పటి జనరల్ డయ్యర్ ఆదేశాలతో జరిగిన కాల్పుల్లో జలియన్‌వాలాబాగ్‌లో వేలాది మంది ఊచకోతకు బ్రిటన్ క్షమాపణ చెప్పి తీరాలనే బహుళ స్థాయి డిమాండ్ల మధ్యలో ఎలిజబెత్, ఫిలిప్‌లు ఈ ప్రాంతాన్ని సందర్శించుకుని వెళ్లారు.

అప్పటివరకూ బ్రిటన్ రాజరిక ప్రతినిధులు కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ జలియన్‌వాలా బాగ్ అంశాన్ని నామమాత్రంగా కూడా ప్రస్తావించకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తు వచ్చారు. ఇందుకు భిన్నంగా క్వీన్ ఎలిజబెత్ తొలిసారిగా ఈ అంశంపై స్పందించారు. జలియన్‌వాలా బాగ్ అమరవీరులకు నివాళులు అర్పించడం చరిత్రలో నిలిచే ఘట్టం అయింది. క్వీన్ తమ హయాంలో ముగ్గురు భారత రాష్ట్రపతులకు ఆతిధ్యం ఇచ్చారు. 1963లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, 1990లో ఆర్ వెంకట్రామన్, 2009లో ప్రతిభాపాటిల్ క్వీన్ ఆహ్వానితులుగా బ్రిటన్‌కు వెళ్లారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News