Thursday, January 23, 2025

ఓటీటీలోకి కెప్టెన్ మిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్, డైరెక్టర్ అరుణ్ మాథేశ్వ‌ర‌న్ కాంబినేషన్ లో వచ్చిన కెప్టెన్ మిల్ల‌ర్ ఓటీటీలోకి రాబోతోంది. తమిళ్ లో సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన ఈ మూవీ ఫిబ్రవరి 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ష్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

కాగా, తమిళ్ లో దాదాపు రూ.100 కోట్లు రాబట్టిన కెప్టెన్ మిల్ల‌ర్.. తెలుగు ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తమిళ్ లో జనవరి 12న విడుదలైన ఈ సినిమా.. తెలుగులో సంక్రాంతికి తీవ్ర పోటీ ఉండడంతో జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచినా.. తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ గా నిలిచింది కెప్టెన్ మిల్లర్.

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్‌మోహ‌న్‌, మాళ‌వికా స‌తీష‌న్ హీరోయ‌న్లుగా న‌టించగా.. హీరో సందీప్‌కిష‌న్ గెస్ట్ రోల్స్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News