Thursday, December 26, 2024

కస్తూర్బాగాంధీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

బెజ్జూరు: బెజ్జూరు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ గురుకుల ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ అరుణ తెలిపారు. కస్తూర్భగాంధీ కళాశాలలో సిఈసి 35, ఎంపిహెచ్‌డబ్లు 30 సీట్లు ఖాళీగా ఉన్నట్లు వారు తెలిపారు. కావున అసక్తి గల విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ కోసం ఎస్‌ఎస్‌సి మెమో, ఆధార్‌కార్డు, టిసి, బోనాఫైడ్ సర్టిఫికేట్‌లతో సంప్రదించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం సెల్ నెంబర్ 9398098253, 9985274136 నెంబర్‌లను సంప్రదించాలని వారు కోరారు. కస్తూర్బాగాంధీ విద్యాలయం చక్కటి వాతావరణంతో పాటు విద్యార్థులకు హాస్టల్ వసతి, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, పౌష్టికాహారం అన్ని రకాల వసతులు ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News