Wednesday, January 22, 2025

కేరళ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఫిట్టింగ్ !

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ‘నా అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ రూపొందించింది. దానిపై సంతకం చేయాలంటూ నా వద్దకు పంపించింది. దీనిపై నాకు నేనుగా తీర్పు చెప్పుకోలేను. రాష్ట్రపతికి పంపిస్తాను’ అని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తొలగించి ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని ప్రతిపాదిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ రూపొందించింది. ఆర్డినెన్స్‌పై గవర్నరే సంతకం చేయాల్సి ఉన్నందున రాజ్‌భవన్‌కు పంపించింది. గవర్నర్‌ సంతకం చేస్తేనే ఆర్డినెన్స్‌ అమల్లోకి వస్తుంది. దీనిపై శనివారం గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకొందని తెలిపారు. దీనిపై సొంతంగా తీర్పు ఇచ్చుకోలేనని అన్నారు. మరోవైపు రాష్ట్ర స్థానిక పరిపాలన శాఖ మంత్రి ఎం.బి.రాజేష్‌ తిరువనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన రాజ్యాంగాన్ని అమలు చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, బిజెపి తప్పుపట్టాయి. కేరళ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను కమ్యూనిస్టు కేంద్రాలుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని విమర్శించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News