Thursday, December 19, 2024

కొనసాగుతున్న మూడో దశ పోలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్ సభ మూడో దశ ఎన్నికలు మే 7న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగుతున్నాయి. గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రధాని మోడీ తన ఓటు వేశారు. అహ్మదాబాద్ లో కేంద్ర మంత్రి అమిత్ షా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి రెండు దశల ఎన్నికలు ఎలాంటి కల్లోలం లేకుండా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోడీ అభినందించారు.

కేంద్ర మంత్రి అమిత్ షా,  మధ్యప్రదేశ్ మాజీ సిఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్(విదిషా) , దిగ్విజయ్ సింగ్ (రాజ్ గఢ్) వంటి బడా నాయకులు ఈసారి లోక్ సభ స్థానానికి పోటీపడుతున్నారు. సమాజ్ వాదీ ఎంపీ డింపుల్ యాదవ్(మైన్ పురి), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియ సూలే(బారామతి) వంటి ప్రముఖులు కూడా బరిలో ఉన్నారు.

మధ్యాహ్నం వరకు ఉత్తర్ ప్రదేశ్  లో 26.12 శాతం ఓటింగ్ జరిగింది. గోవాలో 31 శాతం ఓటింగ్ జరిగింది. కలబురగిలోమల్లికార్జున ఖర్గే ఓటేశారు. మహారాష్ట్ర లాథూర్ లో నటుడు  రితేశ్, నటి జెనీలియా ఓటేశారు.

Modi

 

Kharge

Sharad Pawar

Jenelia

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News