నీతా అంబానీ తన ప్రసంగంలో మానవ చరిత్రలో మనుషులంతా వివిధ తరహాలో చీలిపోయి ఉన్నారన్నారు. మునుపటి కన్నా ఇంకా ఎక్కువగా విజితులయి ఉన్నారన్నారు. కానీ క్రీడలు(స్పోర్ట్స్) ఓ అద్బుత శక్తి(మ్యాజికల్ ఫోర్స్) అని, క్రీడలు ప్రేరేపించడం(ఇన్ స్పయిర్), సాధికరతనివ్వడం(ఎంపవర్), ఐక్యం (యూనైట్) చేయడం వంటివి చేస్తాయన్నారు. క్రీడలను ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, ప్రయివేట్ రంగం, మనమంతా కూడా తోడ్పడాలన్నారు. లెగసీ అన్నది రాత్రికి రాత్రే నిర్మితం కాలేదన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో మనందరికీ పాత్ర ఉందన్నారు. ఒలింపియిజాన్ని మనం నిరంతర సాకారం (డైలీ రియాల్టీ) చేయాలన్నారు. మనమంతా కలిసి జాతిని ఉన్నతంగా తీర్చిదిద్దుదామన్నారు. ఇండియాను నిజమైన స్పోర్టింగ్ గ్లోబల్ హౌస్ గా తీర్చిదిద్దుదామన్నారు. ‘ఇండియా హౌస్’ లో తాము అథ్లెటన్లను వారి కలలు సాకారం చేసుకునేందుకు ప్రోత్సహిస్తునమన్నారు.
భారతీయ అథ్లెట్ల కోసం ఒలింపిక్స్ గ్రామంలో ‘ఇండియా హౌస్’ను ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఇటీవల ఈ ‘ఇండియా హౌస్’ ను ప్రారంభించారు. పారిస్ ఒలింపిక్సష్ ప్రారంభమైన మరుసరటి రోజే, అంటే జులై 27న లా విల్లెట్ ప్రాంతంలో ఈ ఇండియా హౌస్ ను ప్రారంభించారు. ఇండియా హౌస్ ప్రారంభ వేడుకలు ప్రపంచం దృష్టిన ఆకర్షించాయి. ఈ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖలు హాజరయ్యారు.