Wednesday, January 22, 2025

ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాలస్తీనా: గాజా నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 21 మంది మృతి చెందారు. వారిలో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలో అత్యధిక జనాసాంధ్రత ఉండే జబాలియా శరణార్థుల క్యాంపు ప్రాంతంలోని నాలుగంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు.

మొదట చివరి అంతస్తులో మంటలు అంటుకున్నాయని, క్రమంగా అవి బిల్డింగ్‌ మొత్తానికి వ్యాపించాయని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News