Friday, December 27, 2024

చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా టిడిపి శ్రేణుల నిరసన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగుదేశం అధినేత, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా టిడిపి శ్రేణులు భగ్గుమన్నాయి. ఎపి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ తెలంగాణ టిడిపి నేతలు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద పార్టీ నాయకుడు బక్క నర్సింహులు ఆధ్వర్యంలో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని దోమలగూడ టిడిపి పార్టీ కార్యాలయం దగ్గర ఎపి సిఎం జగన్‌పై వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

కూకట్‌పల్లి జేఎన్టీయూ కూడలి వద్ద పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెబుతారని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ భద్రాచలంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఆ పార్టీ శ్రేణులు ఆందోళలు చేపట్టారు. బేషరతుగా టిడిపి అధినేతను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో నిరసన చేపట్టిన కార్యకర్తలు ఓటమి భయంతోనే చంద్ర బాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని, సిఎం జగన్ డౌన్‌డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు. హనుమకొండ జిల్లా పరకాల అంబేడ్కర్ కూడలిలో కార్యకర్తలు కళ్లకు నల్ల రిబ్బను కట్టుకుని నిరసన తెలిపారు. సిఎం జగన్ డౌన్ డౌన్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News