Friday, November 22, 2024

చెలరేగారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నస్రుల్లాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో జరిగిన ఘర్ష ణల్లో ఒకరు మృతి చెం దారు. వివరాల్లోకి వెళితే ….కామారెడ్డిజిల్లా, బాన్సువాడ డివిజన్ పరిధి, నస్రుల్లాబాద్ మండలం, నాచుపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి గ్రామాని కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సాదుల రాములు (40) హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి వరకు ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కార్యకర్తలు విందులు చేసుకుని, వారి వారి పార్టీల పాటలతో డ్యాన్సులు చేస్తుండగా,బిఆర్‌ఎస్ నాయకులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ పాటలు పెట్టవద్దని డిమాండ్ చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు సాదుల రాములుకు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని శాంతింపజేసే సమయంలో అతనిపై కొందరు దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనను చికిత్స నిమిత్తం బాన్సువాడకు తరలిద్దామనుకుంటున్న సమయంలో అప్పటికే రాములు మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాయఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు. సిఐ, నలుగురు ఎస్సైలతో, పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. శవ పంచనామాకు సహకరించాలని పోలీసులు కోరినా, న్యాయం జరిగే వరకు శవ పంచనామా జరిగేది లేదని గ్రామస్థులు పట్టుబట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. హత్య చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ వివిధ ప్రాంతాల నుంచి భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ మురళి, నస్రుల్లాబాద్ ఎస్సై లావణ్య తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News