Sunday, January 19, 2025

డబుల్ బెడ్ రూంలు అందించిన తరువాత మాత్రమే మంత్రి సబిత ఓట్లు అడగాలి

- Advertisement -
- Advertisement -

బాలాపూర్:మహేశ్వరం నియోజకవర్గంలోని పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లను అందజేసిన తరువాత మాత్రమే రాష్ట్ర మంత్రి,స్ధానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి ఇక్కడి ప్రజలను ఓట్లు అడగాలని బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్,టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాతనర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు.నియోజకవర్గంలోని హర్షగూడ గ్రామ సర్పంచ్ పాండునాయక్ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పారిజాతనర్సింహ్మారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల ఆశచూపి,ఎన్నికల్లో తిరిగి గెలుపొందాలన్న కుట్రలో భాగంగానే మంఖాల్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి 3 ఏండ్లు అయినా మంత్రి సబిత అబ్దిదారులకు అందజేయడంలేదని ఆరోపించారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ పెట్టిన భిక్షతోనే నేడు సబిత మంత్రి పదవిని అనుభవిస్తుందని,అధికారపార్టీలో ఉంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మాయమాటలు చెప్పి,ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.ఎన్నికల సందర్భంలో అనేక హామీలను ఇచ్చి,విస్మరించిన మంత్రి సబితను ప్రజలు అడుగుఅడుగునా అడ్డుకోవాలని పిలుపును ఇవ్వడంతో పాటు రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌టిసెల్ అధ్యక్షుడు రాజునాయక్,నాయకులు ఆలె కుమార్,శివ,సేవ్యనాయక్,వత్తుల నారాయణ,ఆనంద్‌నాయక్,గన్సీరాం నాయక్,రవినాయక్,రాకేశ్,జంగయ్య,ఒగ్గు శ్రీకాంత్,రాజు,నర్సింహ్మా,శశికాంత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News