- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ, దాని పరిసర నగరాల్లో ఆదివారం ఉదయం స్వల్ప భూప్రకంపనాలు సంభవించాయి. భూకంప తీవ్రత 4.9గా ఉండింది. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో కూడా భూకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌తజకిస్థాన్ సరిహద్దులో నమోదయింది. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఫయజాబాద్ ఆగ్నేయంలో ఉదయం 10.19 గంటలకు 70 కిమీ. దూరంలో భూకంపం సంభవించింది. దాని తీవ్రత 5.9గా నమోదయింది. కాగా భూప్రకంపనాలు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, పూంచ్‌లలో కూడా నమోదయ్యాయి.
భూకంప కేంద్రం(ఎపిసెంటర్) ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఆగ్నేయ ఫయజాబాద్‌లో 79 కిమీ. దూరంలో నమోదయింది. భూకంపం ఉదయం 11.19 గంటలకు భూఉపరితం నుంచి 220 కిమీ. భూగర్భంలో నమోదయింది. ఇదిలావుండగా ఢిల్లీలోని నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తాము భూప్రకంపనాలు ఫీలయ్యామని తెలిపారు.
- Advertisement -