Wednesday, January 22, 2025

తమిళనాడులో జల్లికట్టు పోటీలు ప్రారంభం…70 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో ఎద్దులను లొంగదీసుకునే జల్లికట్టు పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. థాచన్‌కురిచి గ్రామంలో ఈ జల్లికట్టు ప్రాంగణ స్థలంలోకి ఆదివారం ఉదయం దాదాపు 300 ఎద్దులను ఒకదాని తరువాత ఒకటి ప్రవేశ పెట్టారు. ఎద్దులను లొంగదీసుకోడానికి కనీసం 350 మంది పోటీ పడ్డారు. ఈ సందర్భంగా 70మంది గాయపడ్డారు. పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.

రాష్ట్ర పర్యావరణ మంత్రి శివ వి మెయ్యనాథన్, న్యాయశాఖ మంత్రి ఎస్ రేగుపతి ఈ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోటారు సైకిళ్లు, ప్రెజర్ కుక్కర్లు, కాట్స్ బహుమతులుగా ఉంచారు. ఈ క్రీడలకు అనుమతి ఇచ్చే ముందు అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తమిళనాడు ప్రభుత్వం ఈ జల్లికట్టు పోటీలకు తీసుకోవలసిన జాగ్రత్తలపై సమగ్రంగా మార్గదర్శకాలను జారీ చేసింది. పుదుక్కొట్టై జిల్లాలో గుర్రపు బండ్ల పోటీలు కూడా ఇటీవలనే నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News