Saturday, December 21, 2024

తుపాకీతో కాల్చుకుని రైలులో ప్రయాణికుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

గువాహటి(అస్సాం): న్యూఢిల్లీ వెళుతున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక ప్రయాణికుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్‌గురి స్టేషన్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి తెలిపారు.జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ఒకరు రాత్రి 8 గంటల ప్రాంతంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన చెప్పారు. మృతుడి వద్ద టిక్కెట్ కాని, మరే ఇతర గుర్తింపు పత్రాలు కాని లభించలేదని ఆయన తెలిపారు.

మృతుడి వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం న్యూ జల్పాయ్‌గురిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. రైల్వే బోగీని న్యూ జల్పాయ్‌గురి స్టేషన్‌లో డిటాచ్ చేసినట్లు ఆయన చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఏ స్టేషన్‌లో రైలు ఎక్కాడు, అతని వద్ద గన్ ఎలా వచ్చింది వంటి వివరాలు ఇంకా తెలియరావలసి ఉంది. గువాహటిలోని కామాఖ్య నుంచి న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ వెళుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News