Sunday, December 22, 2024

తెలంగాణకు మణిహారం.. హరితహారం

- Advertisement -
- Advertisement -

సారంగాపూర్: తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం తెలంగాణ రాష్ట్రానికి మణి హారంగా రూపుదిద్దుకుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలో బతుకమ్మ ఫారెస్టు నర్సరీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అటవి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంతసురేష్, జిల్లా కలెక్ యాస్మిన్ బాషా, ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు.

అనంతరం పలువురు ఫారెస్టు అధికారులు, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించా రు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు గ్రామాలు సుందరంగా రూపుదిదుకుంటున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటుతున్నారని, అందరికీ అందుబాటు లో మొక్కలను అందజేయడం కోసం గ్రామాల్లోనే నర్సరీలను స్థాపించి అందుబాటులోని అనేక రకాల మొక్కలు పెంచడం జరు గుతుందన్నారు. పచ్చదనం పెంపొందించినప్పుడే వాతావరణంలో సమతుల్యత సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్తు తరా లకు ఆరోగ్యవంతమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News