Sunday, December 22, 2024

తెలంగాణ బిజెపి సీనియర్ల రహస్య సమావేశం.. ఈటలపై అసంతృప్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిజెపిలో రాజకీయాలు వేడివాడిగా సాగుతున్నాయి. దీంతో బెజిపి నేతలు ఆదివారం ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో వివేక్, జితేందర్ రెడ్డి, విజయశాంతి, విఠల్, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్ర నాయక్, దేవయ్య హాజరయ్యారు. బిజెపిలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించారు.

ఈటలకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి అంటూ జరుగుతున్న ప్రచారంపై అసంతృప్తి వ్యక్యం చేస్తున్నారు నేతలు. పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు అవకాశం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో తాము కూడా కీలకంగా పనిచేశామని కొందరు నేతలు అంటున్నట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లి లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని నేతలు మండిపడుతున్నారు. తమకు పార్టీలో పరిణామాలు తెలియట్లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News