- Advertisement -
హైదరాబాద్: నెక్లస్ రోడ్డులో జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను హోం మంత్రి మమూద్ అలీ, జిహెంఎసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ తదితరులు మంగళవారం పరిశీలించారు. ఉత్సవాల్లో పాల్గొనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా తాగు నీటి సమస్యలు లేకుండా చూడాలని వారు అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అధికారులు మందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు ఈ నెల 2 నుంచి జరుగుతున్న సంగతి తెలిసింది.ఈ సందర్భంగా గత 9 సంవత్సరాల్లో విద్యా ,వైద్యం, విద్యుత్, వ్యసాయం, పరిశ్రమలు , ఇతర రంగాల్లో జరిగిన పలు అభివృద్ధి పనులను అధికారులు ప్రజలకు వివరిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
- Advertisement -