Wednesday, January 22, 2025

దేశానికే ఆదర్శంగా తెలంగాణ గ్రామాలు

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

కీసరః తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం కరీంగూడలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి మల్లారెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కౌకుట్ల గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంబలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలకు అన్ని సౌకర్యాలు సమకూరాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని అన్నారు.

గత తొమ్మాదేళ్లలో వందలకు పైగా అవార్డులు తెలంగాణకు వరించాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేష్, ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, ఎంపీటీసీ మంచాల కిరణ్‌జ్యోతి ప్రవీణ్, ఉప సర్పంచ్ మాధవ్‌రెడ్డి, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు జాల్‌పురం సుధాకర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News