Thursday, January 23, 2025

నగరంలో సిగ్నల్ రహిత ప్రయాణమే జిహెచ్‌ఎంసి లక్షం : మేయర్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో సిగ్నల్ రహిత ప్రయాణమే లక్షంగా జిహెచ్‌ఎంసి కృషి చేస్తోందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఇందులో భాగంగా ఎస్‌ఆర్‌డిపి మొదటి దశలో 8వేల కోట్ల అంచనా వ్యయంతో 48 పనులను చేపట్టి ఇప్పటి వరకు 35 పనులు పూర్తికాగా 36 ప్రాజెక్టు ఇందిరాపార్క్ విఎస్‌టి స్టీల్ బ్రిడ్జి ఫ్ల్లైఓవర్ సైతం త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలిపారు. గురువారం కాప్రా సర్కిల్ మల్లాపూర్ లో రూ. 2.43 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు పనులకు స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ దేవేందర్‌రెడ్డిలతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఇందులో మల్లాపూర్‌లోని భవాని నగర్ కామన్ వద్ద రూ.73 లక్షలతో ఓపెన్ నాలాపై కల్వర్టు నిర్మాణం, మరో రూ.1.70 కోట్ల వ్యయంతో బ్రహ్మపూరీ కాలనీ నుంచి బెల్ కంపెనీ కంపౌండ్ వరకు బాక్స్‌డ్రైన్‌ను నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 48 పనులలో ఇప్పటి వరకు 19 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్, 7 ఆర్ ఓబిలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు ఎస్‌ఎన్‌డిపీ ద్వారా రూ.733 కోట్ల వ్యయంతో నగరంలో 35 పనులు చేపట్టామని ఇప్పటి వరకు 30 పనులు పూర్తి అయ్యాయి మిగతా పనులు తుది దశలో ఉన్నాయని వెల్లడించారు. గతంలో వరదకు గురైన ప్రాంతాల్లో నాలాలను అభివృద్ది చేయడం ద్వారా ఈ ఏడాది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ వర్షాకాలం కురిసిన భారీ వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదన్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గంలో రూ. 122 కోట్ల వ్యయంతో ఎస్.ఎన్.డి.పి చేపట్టగా లోతట్టు ప్రాంతాల్లో వరద ఇబ్బందులు లేకుండా పోయిందన్నారు.

ఉప్పల్ నియోజకవర్గంలో 9 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి జరిగిందని ఈ విషయం ప్రజలు గమనించాలన్నారు.ఉప్పల్ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. మల్లాపూర్ ప్రజలు గతంలో త్రాగునీరు, డ్రైనేజీ, వరద సమస్యలతో ఇబ్బంది పడేవారని, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక మౌలిక వసతుల అభివృద్ధి కృషి జరిగిందని అంతే కాకుండా వైకుంఠదామాలు, పార్కు అభివృద్ధి తదితర పనులు చేపట్టినట్లు చెప్పారు.

అంతేకాకుండా పలు కాలనీలో వరద నివారణకు 17 కల్వర్టులు చేపట్టామన్నారు.మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మేయర్ సహకారంతో మల్లాపూర్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ, ఎస్.సి అశోక్ రెడ్డి, డి సి ముకుంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్డు కార్యాలయం తనిఖీ
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి లతో కలిసి గురువారం మల్లాపూర్ వార్డు కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ అక్కడ అందిన ప్రజా ఫిర్యాదులను పరిశీలించడంతో పాటు పరిష్కరించిన వాటి వివరానలు అడిగి తెలుసుకున్నారు. వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేశారు రెండు నెలలు కావస్తుండడంతో పూర్తి పారదర్శకత జవాబుదారి తనంతో పని చేయాలని వార్డు కార్యాలయం పరిపాలన అధికారిని అదేశించారు. అదేవిధంగా ఏ ఎస్ రావు నగర్ డివిజన్‌లో చేపట్టిన నాలా పనులను కార్పొరేటర్ శిరీష రెడ్డి తో కలిసి మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాలా పనులు సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News