Thursday, January 23, 2025

నటి మీరా జాస్మిన్‌కు పితృ వియోగం

- Advertisement -
- Advertisement -

తండ్రి మరణంపై నటి ఎమోషనల్

ఆదివారం అంత్య క్రియలంటూ పోస్ట్

కొచ్చిన్:  టాలీవుడ్ హీరోయిన్, నటి మీరా జాస్మిన్ ఇంట్లో విషాదం నెలకొంది. మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిఫ్ (83) గురువారం నాడు కన్నుమూశారు. ఈ విషయాన్ని మీరా జాస్మిన్ తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ‘మళ్లీ కలిసే వరకు ఇంతే అనంతమైన ప్రేమతో’ అంటూ ఎమోషనల్ పోస్ట్ వేసింది. తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేస్తూ, తండ్రితో ఉన్న అనుబంధం చాటి చెప్పేలా ఫోటోలను షేర్ చేసింది. ఇక తాజాగా తన తండ్రి గురించి పూర్తి వివరాలు తెలియజేసేలా ఇన్ స్టాలో స్టోరీ పెట్టేసింది.

మా నాన్నగారు జోసెఫ్ ఫిలిఫ్ (83)  సన్ ఆఫ్ స్వర్గీయ ఫిలిఫ్ తలయిల్ పుతెన్వీటిల్ ఎలంథూర్లో నివసిస్తుండేవారు. ఆ తరువాత ఆయన ముంబైకి వెళ్లారు. అటుపై తిరువల్ల, కొచ్చి వంటి ప్రదేశాల్లో జీవించారు. ఆలేయమ్మ జోసెఫ్ (భార్య), పిల్లలు జియోమన్, జెనీ సూసన్, సారా రోబిన్, మీరా జాస్మిన్, జార్జ్, మనవళ్లు, మరదళ్లు, తమ్ముళ్లు ఇలా అందరితోనూ కలిసి జీవించారు.

‘ఆయన పార్థీవ శరీరం శనివారం రోజు  మా వద్దకు వస్తుంది.. ఆయన ఆత్మ శాంతి కోసం మాతో పాటుగా ప్రార్థనలు చేయండి.. మధ్యాహ్నం రెండు నుంచి ప్రేయర్స్ జరుగుతాయి.. ఆదివారం నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి’ అంటూ ఇలా అన్ని విషయాలను పోస్ట్ చేసింది. మీరా జాస్మిన్ తెలుగులో కనిపించి చాలా కాలమే అవుతోంది. చాలా గ్యాప్ తరువాత సముద్రఖని, అనసూయ నటించిన ప్రేమ విమానం సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కాసేపు మెరిసింది.

Meera Jasmin family

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News