Tuesday, January 7, 2025

నటుడు నానిని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :  తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్ తెలుగు నటుడు నానిని కలిశారు. నాని ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన విషయాలను ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. నానిని కలుసుకోవడం తనకు ఎంతో సంతోషానిచ్చిందని గారెత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాని సినీ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్ సంబంధాలను ఎలా బలోపేతం చేసుకోవచ్చన్న విషయాన్ని కూడా చర్చించినట్లు తెలిపారు.

ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇదివరలో నాని నటించిన ‘దసరా’, ‘హాయ్ నాన్న’ సినిమాలు బాక్సాఫీసు హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలో హిరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా, ఆ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నటుడు నాని తాను నటించిన కొన్ని చిత్రాలను చూడాల్సిందిగా గారెత్ విన్ ఓవెన్ కు ఈ సందర్భంగా సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News