Saturday, December 28, 2024

నాన్నా.. మీరు నాతో ఉన్నారు..మీరే నా స్ఫూర్తి : రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32 వ వర్ధంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆదివారం ఉదయం న్యూఢిల్లీ లోని వీర్‌భూమి వద్ద నున్న రాజీవ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా వీరి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ ట్విటర్ వేదికగా భావోద్వేగ పోస్టు చేశారు. “ నాన్నా… మీరు నాతోనే ఉన్నారు. మీరే స్ఫూర్తి. మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో రాజీవ్ జ్ఞాపకాలను గుర్తు చేసే వీడియోను కూడా జత చేశారు.

రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ తన తండ్రిని స్మరించుకుంటూ హరివంశరాయ్ బచ్చన్ రాసిన కవితను షేర్ చేశారు. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20 న జన్మించారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజక వర్గానికి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. తల్లి ఇందిరాగాంధీ అంగరక్షకుల కాల్పులకు బలైన తరువాత రాజీవ్ 1984 అక్టోబర్‌లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 40 ఏళ్ల వయసు లోనే ప్రధాని అయి రికార్డు సృష్టించారు. 1989 అక్టోబర్ 2 వరకు ప్రధానిగా కొనసాగారు. 1991 మే 21న తమిళనాడు లోని శ్రీ పెరంబుదూరులో ఉగ్రసంస్థ ఎల్‌టీటీఈ బృందం ఆత్మాహుతి దాడుల్లో రాజీవ్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్మారకార్ధం ఏటా మే 21న జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని దేశం జరుపుకొంటోంది. 1991లో రాజీవ్ గాంధీని భారత రత్న పురస్కారంతోదేశం గౌరవించుకుంది.
ప్రధాని మోడీ నివాళి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News