Friday, December 27, 2024

కమలానికి ఝలక్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) మేయర్ ఎ న్నికల్లో నామినేటెడ్ సభ్యులు ఓటేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ పరిణామం ఎంసిడిలో ఎ క్కువ స్థానాలతో ఉన్న ఆమ్ ఆద్మీపార్టీకి నైతిక విజయం కా గా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు శరాఘాతమైంది. ఆప్, బిజెపి మధ్య వివాదం, ఈ దశలోనే లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా నామినేటెడ్ సభ్యులను నియమించడం వీరికి ఓటు హక్కు క ల్పించడం వంటి పరిణామాలు ఆమ్ ఆద్మీపార్టీ సునాయాస విజయానికి అడ్డంకులుగా మారాయి. దీనిని సవాలు చేస్తూ ఢిల్లీలో ఆప్ తరఫు మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు చెల్లనేరదని, ఈ మేరకు సరైన ఆదేశాలు వెలువరించి, మేయర్ ఎన్నికకు మార్గం సుగమం చేయాలని పిటిషన్‌లో ఆమె అభ్యర్థించారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారథ్యపు ధర్మాసనం అన్ని విషయాలను పరిశీలించి నామినేటెడ్ సభ్యుల ఓటు హక్కు రాజ్యాంగ నియమావళి ప్రకారం చెల్లనేరదని తెలిపింది. వెంటనే ఎంసిడి సమావేశం ఏర్పాటు చేసి, ఈ తొలి సమావేశంలోనే మేయర్ ఎన్నిక జరిపించాలని, ఆ తరువాత ఎన్నికైన మేయర్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణకు వెళ్లాలని న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్ధీవాలా కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం తెలిపింది. మేయర్ ఎన్నిక తరువాతనే ఎంసిడిలోని ఇతరత్రా సంబంధిత ఎన్నికలకు ఏర్పాట్లు జరగాల్సి ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది.

ప్రస్తుత పరిణామం లెఫ్టినెంట్ గవర్నర్‌తో ప్రత్యక్ష వివాదాల నడుమ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీపార్టీకి మేలు చేసేదిగా మారింది. మెజార్టీ నేపథ్యంలో ఆప్ అభ్యర్థి మేయర్ అవుతారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి తాము వివిధ పక్షాల వాదనలను విన్నామని , దీని మేరకు పరిశీలించగా నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు లేదని రాజ్యాంగంలో నిర్ధేశించి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. వారికి సంబంధించి రాజ్యాంగంలో నిర్థిష్ట ఆంక్షలు ఉన్నాయి. సంబంధిత విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈ రాజ్యాంగ ప్రక్రియకు అనుగుణంగానే తాము స్పందిస్తున్నామని, నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే వీలులేదని చెపుతున్నామని ధర్మాసనం తేల్చిచెప్పింది. తాము ఇప్పుడు వెలువరిస్తున్న ఆదేశాల తరువాత 24 గంటల వ్యవధిలోనే మేయర్ ఎన్నికకు సంబంధిత ఎంసిడి తొలి సమావేశానికి నోటీసు వెలువరించాల్సి ఉంటుంది.

ఇందులోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల తేదీ సమయం వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. గత వారమే సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని పేర్కొంటూ, దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం , ఎంసిడి ప్రోటెం నిర్వాహక అధికారి సత్య శర్మ ఇతరుల సమాధానాలను కోరింది.
తోడుదొంగచేష్టల ఎల్‌జి, బిజెపి నేతలకు చెంపపెట్టు
సుప్రీంకోర్టు స్పందనపై కేజ్రీవాల్ హర్షం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలలో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలను ఆప్ నేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఇప్పటివరకూ లెఫ్టినెంట్ గవర్నర్, బిజెపి ఏ విధంగా ఢిల్లీలో అక్రమ అరాచక ఆదేశాలు వెలువరిస్తున్నాయనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పష్టం అయిందని, ప్రత్యేకించి బిజెపికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు రూలింగ్ ప్రజాస్వామ్య విజయం అని, న్యాయస్థానానికి వేనవేల ధన్యవాదాలని కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటి ఆదేశాలతో ఇక రెండున్నర నెలల అడ్డంకుల తరువాత ఢిల్లీకి మేయర్ వస్తున్నారని తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు, బిజెపికి ఏది ప్రజాసామ్యయుతంగా ఉండకూడదు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం వారి నైజంలో లేదని విమర్శించారు.

బిజెపి నేతలు, లెఫ్టినెంట్ గవర్నర్ తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నారని ఇప్పటి పరిణామం వారికి ఎదురుదెబ్బ అయిందని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుత పరిణామంతో ఢిల్లీ గెలిచిందని ఆప్ ఎంపి రాఘవ చద్ధా ట్వీటు వెలువరించారు. ఇప్పటి పరిణామంతో ఎల్‌జి వెంటనే స్పందించి ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు తెలిపి , పదవికి రాజీనామా చేయడం మంచిదని సూచించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఎంసిడి ఎన్నికలు జరిగాయి. ఇందులో బిజెపి 134 స్థానాలలో గెలిచింది. తరువాతి స్థానంలో బిజెపికి 104, కాంగ్రెస్‌కు 9 స్థానాలు వచ్చాయి. అయితే వెనువెంటనే జరగాల్సిన మేయర్ ఎన్నికల ప్రక్రియను బిజెపి తరచూ అడ్డుకుంటూ వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News