Monday, December 23, 2024

నిమ్స్‌లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్పెషల్ సిఎస్ కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేవారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. కేడర్ వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతల ఆధారంగా అభ్యర్థులను నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఎంపిక చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News