Sunday, January 19, 2025

నీకు కౌంట్ డౌన్ మొదలైంది జగన్ రెడ్డీ!: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

‘అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే చర్చకు రా!’ అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిఎం జగన్ కు ఎక్స్ (ట్విటర్) వేదికగా సవాల్ విసిరారు. ‘ప్లేస్, టైమ్ నువ్వే చెప్పు.. ఎక్కడికైనా వస్తా… దేనిమీదైనా చర్చిస్తా. సిద్ధమా జగన్ రెడ్డీ. సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి, బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి  అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? నీకూ నీ ప్రభుత్వానికీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. ఇక యాభై రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు’ అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News