- Advertisement -
న్యూఢిల్లీ: తమ జలాలోకి ప్రవేశించిన భారత జలాంతర్గామిని అక్టోబర్ 16 న పాకిస్థానం నావికా గస్తీ విమానం అడ్డుకున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలను భారత నావికా వర్గం ఖండించింది. అక్టోబర్ 19న పాకిస్థాన్ సేనకు చెందిన మీడియా విభాగం, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పిఆర్) ప్రకటనను, వీడియోను భారత నావికా వర్గం పరిశీలించింది. అయితే వీడియోలో జిపిఎస్ ప్రకారం కరాచీకి 140-150 నాటికల్ మైల్స్ దూరంలో ఉందని తెలుస్తోందని నివేదించింది. పాకిస్థాన్ తీరానికి కేవలం 12 నాటికల్ మైల్స్ విస్తారం మాత్రమే ఉంటుంది. కనుక పాకిస్థాన్‌కు చేరిన జలాంతర్గామి మరేదైనా దేశందై ఉంటుందని కూడా భారత నావికా వర్గం భావిస్తోంది. అంతేకాక పాకిస్థాన్ ఇలాంటి కట్టుకథల వార్తలు కూడా వ్యాపింపజేస్తూ ఉంటుందని తెలిపింది.
- Advertisement -