Monday, December 23, 2024

పీపుల్స్‌ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్ర ప్రదర్శనను చేనేత ఉత్పత్తుల అమ్మకాలను రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి పర్యాటకశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ నెల 7 నుండి 15వ తేదీ వరకు కొనసాగనున్న ఈ వస్త్ర ప్రదర్శన, అమ్మకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో కులవృత్తులు కనుమరుగయ్యాయన్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ కుల వృత్తులకు జీవనం పోశారని, చేనేతల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారన్నారు. గద్వాల, నారాయణపేట, పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు దక్కిందన్నారు. చేనేత వస్త్రాలు ధరిస్తే రోగాలు రావని వైద్యులు సూచిస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు.
మంత్రి కేటీఆర్ సోమవారం రోజు చేనేత భవన్‌కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర చేనేత కార్మికుల కళలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం అభినందించారన్నారు. వారంలో నాలుగు రోజులు చేనేత వస్త్రాలను ధరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గోన్నారు.
నీరా కేఫ్ సందర్శన ..
చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభానికి వచ్చిన క్రమంలో నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్‌ను వారు పరిశీలించారు. అనంతరం ప్రకృతిసిద్దమైన, ఆరోగ్య ప్రదాయిని… ఎన్నో ఔషధ గుణాలున్న నీరాను మంత్రులు సేవించారు. నీరాతో తయారైన అనుబంధ ఉత్పత్తులు తేనె ,బూస్ట్, సిరప్ లను సత్యవతిరాథోడ్ తదితరలు పరిశీలించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన ఔషధ గుణాలున్న నీరాను తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో నీరా ఉత్పత్తి, ప్రాసెసింగ్ కేంద్రాలను పూర్తి స్థాయిలో త్వరలో ప్రారంభించబోతున్నామన్నారు.

Neera cafe

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News