Sunday, December 22, 2024

ప్రజాభవన్ ముందు కారు బీభత్సం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బేగంపేటలోని ప్రజాభవన్ ముందు శనివారం కారు బీభత్సం సృష్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టిఎస్ 13ఇటి0777 అనే నంబర్ గల కారు ఈ నెల 23న తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో అతి వేగంతో ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. కారులో ఒక వ్యక్తి పరారు కాగా మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు ఉన్నట్టు గుర్తించారు. కారును నిర్లక్ష్యంగా నడిపిన కారు అబ్దుల్ ఆసిఫ్(27) అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బోధన్‌కు చెందిన ప్రజాప్రతినిధి తనయుడు కారు నడిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అసలు నిందితుడిని వదిలి మరొకరి పేరు చేర్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేసి ఇంకా వివరాలు వెల్లడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News