Monday, December 23, 2024

ప్రజాస్వామ్యంపై నిరంకుశపు నీడలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశ గా దేశం పయనిస్తోందని, దేశంలోని తొమ్మిది విపక్ష పార్టీల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విపక్షాలను లక్ష్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఏ జెన్సీలు పనిచేస్తున్నాయని ఆదివారం నా డు రాసిన ఆ లేఖలో వారు మండిపడ్డారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తూ ఈ మేరకు ఉమ్మడి లేఖను మోడీకి పంపించారు. సిసోడియా కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం లేకున్నా పక్కా టార్గెట్‌తోనే ఆయన్ను అరెస్టు చేశార ని విపక్ష పార్టీల నాయకులు ఆరోపించా రు.

2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ లు విపక్షాలను లక్ష్యంగా చేసుకొని పనిచేశాయని వారు ఆ లేఖలో ధ్వజమెత్తారు. లే ఖ రాసిన వారిలో ముఖ్యమంత్రులు కె.చం ద్రశేఖర్ రావు, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపి సుప్రీం లీడర్ శరద్ పవార్, శివసేన (యూబిటి) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌లున్నారు.
బిజెపి పాలనలో భారత ప్రజాస్వామ్య విలువలు ఏ స్థాయిలో దాడికి గురవుతున్నాయో ప్రపంచం గుర్తిస్తోందని వారు తెలిపారు. ప్రభుత్వ ఏజెన్సీలు 2014 తర్వాత చేసిన అరెస్టులు, సోదాలు బిజెపియేతర పార్టీలే లక్ష్యంగా సాగుతున్నాయని వారు పే ర్కొన్నారు. 201415 సంవత్సరంలో హిమంత బిశ్వశర్మ (ప్రస్తుతం అసోం సిఎం)పై శారదా చిట్‌ఫండ్ స్కా మ్ కేసులో సిబిఐ, ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేశాయ ని, బిజెపిలో చేరిన తర్వాత ఆ కేసు పురోగతే లేదని వారు తెలిపారు. నారదా స్కాంలో పేర్లు వినిపించిన బంగాల్లో సువేందు అధికారి, ముకుల్ రాయ్, మహారాష్ట్రలో నారాయణ్ రాణే వంటి వారి విషయంలోనూ ఇదే జరిగిందని, మరోవైపు, ఎన్నికల సమయాల్లో విపక్షాల నాయకులపై ఈడీ, సిబిఐ దాడులు ఉద్ధృతం కావడం, ఇవన్నీ రాజకీ య ప్రోద్భలంతోనే జరిగాయని వారు లేఖలో తెలిపారు. దర్యాప్తు సంస్థలను విపక్షాలను వేధించేందుకే ఈ సంస్థలను ఉపయోగించుకుంటోందని వారుఆరోపించారు.
ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా…
లాలూ ప్రసాద్ యాదవ్ (రాష్ట్రీయ జనతాదళ్), సంజయ్ రౌత్ (శివసేన), ఆజం ఖాన్ (సమాజ్‌వాదీ పార్టీ), నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ (ఎన్సీపి), అభిషేక్ బెనర్జీ (టిఎంసి) మొదలైన ప్రముఖ ప్రతి పక్షనేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇదే విధంగా ఎదుర్కొన్నారని వారు తెలిపారు. ఈ సంఘటనలను పరిశీలిస్తే కేంద్రంలోని పాలకవర్గానికి అనుబంధ విభాగాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయన్న అనుమానం కలుగుతుందని వివక్షాలు ఆ లేఖలో ఆరోపించాయి.

ఇలాం టి అనేక సందర్భాల్లో నమోదైన కేసులు, అరెస్టులు, వాటి సందర్భాలను పరిశీలిస్తే ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయని, అవి రాజకీయ ప్రేరేపితమైనవని స్పష్టంగా అర్థమవుతుందని వారు తెలిపారు. ప్రతిపక్షాలను అణచివేయడం, అడ్డు తొలగించుకోవడం కోసమే ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలను లక్ష్యంగా చేసుకున్నారని, అందుకోసమే బిజెపి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తుందని వారు అనుమానం వ్యక్తం చేశారు.
అదానీ వ్యవహారంలో కేంద్ర ఏజెన్సీల నిర్లక్షం
ఎస్‌బిఐ, ఎల్‌ఐసి వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడం వల్ల రూ.78 వేల కోట్లు కోల్పోయాయని అదానీ- వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఎందుకు స్పందించడం లేదని విపక్షాలు ప్రశ్నించాయి. ప్రాధాన్యాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆ లేఖలో వివక్షాలు పేర్కొన్నాయి. దీంతోపాటు దేశ సమాఖ్య వ్యవస్థపై కేంద్రం యుద్ధం ప్రకటించిందని, దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల్లో పదేపదే గవర్నర్లు జోక్యం చేసుకుంటున్నారని వివక్షాలు తెలిపాయి.
ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్, పంజాబ్, తెలంగాణ వంటి భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కావాలనే పాలనను అడ్డుకుంటున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగేందుకు గవర్నర్లు కారణమవుతున్నారని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. సహకార సమాఖ్యా విధానానికి ఇది విరుద్ధమన్నారు. మీ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నా సరే, వేరే పార్టీ భావజాలానికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు, మీరు ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని గౌరవించి తీరాలని, ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అత్యున్నతమయ్యిందన్నారు.
గవర్నర్లు ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడం తప్పు
గవర్నర్లు ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడాన్ని వారు తప్పుబట్టారు. గవర్నర్లు ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్ధేశపూర్వకంగా అణగదొక్కుతున్నారని వివక్షాలు ఆ లేఖలో ఆరోపించాయి. బిజెపియేతర పార్టీలు పాలన సాగిస్తున్న తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు, కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలను పెంచేలా, సహకార సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదకారిగా తయారయ్యిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని, అయినప్పటికీ, రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ రాజ్యాంగ విలువలను పాటిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

గవర్నర్ల వ్యవస్థ అనుసరిస్తున్న సమాఖ్య వ్యతిరేక వైఖరి పర్యవసానంగా, నేడు భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర ఏమిటనీ ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని వారు ఆ లేఖలో ప్రస్తావించారు. దేశ ఫెడరలిజానికి వ్యతిరేకంగా యుద్ధం చేపట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇంకో వ్యవస్థను ఉసిగొల్పుతున్నట్టు అనిపిస్తుందని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా గవర్నర్ల కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ, రాష్ట్రాల పాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆకాంక్షలే అన్నిటికంటే కీలకం
ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారాలు, ఆకాంక్షలే అన్నిటికంటే కీలకమని విపక్షాలు పేర్కొన్నాయి. ప్రజలు ఇచ్చి న తీర్పును శిరసావహించాలని వారు స్పష్టం చేశారు. ఒక పార్టీకో, వ్యక్తికో భిన్నంగా ఉన్న భావజాలాన్ని సైతం గౌరవించాలని ఆ లేఖలో వారు హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News