Saturday, November 23, 2024

ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు మూడు కాంస్యాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తాష్కెంట్ వేదికగా జరిగిన పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మూడు కాంస్య పతకాలను సాధించింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోటీల్లో భారత బాక్సర్లు ఓటమి పాలయ్యారు. తెలుగుతేజం మహ్మద్ హుసాముద్దీన్ (51 కిలోలు) గాయం కారణంగా సెమీస్ బరిలోకి దిగలేదు. దీంతో అతని ప్రత్యర్థికి వాకోవర్ లభించింది. ఈ నేపథ్యంలో హుసాముద్దీన్ కాంస్యంతోనే సరిపెట్టుకోక తప్పలేదు.

మరోవైపు 51 కిలోల విభాగం సెమీ ఫైనల్లో భారత స్టార్ బాక్సర్ దీపక్ కుమార్ ఓటమి పాలయ్యాడు. ఫ్రాన్స్‌కు చెందిన బిలాల్ బెన్నామతో జరిగిన సెమీస్ పోరులో దీపక్ 34తో పరాజయం చవిచూశాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో దీపక్ చివరి వరకు గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ పోరులో ఓటమి పాలుకావడంతో దీపక్‌కు కాంస్య మాత్రమే దక్కింది. 71 కిలోల విభాగంలో నిశాంత్ దేద్ పరాజయం పాలయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News