లక్నో: లఖీంపూర్ ఖేరిలో చనిపోయిన నలుగురు రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళుతున్నప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు సోమవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని నిర్బంధంలోకి తీసుకున్నారు.
“రైతులను అణచివేయడానికి ప్రభుత్వం రాజకీయాలను వాడుతోందని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. ఇది రైతుల దేశం. బిజెపిది కాదు…బాధితుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లాలనుకున్న నేను ఎలాంటి నేరం చేయలేదు. మీరెందుకు నన్ను అడ్డుకుంటున్నారు? నన్ను నిర్బంధించేందుకు మీ దగ్గర వారెంట్ ఉందా?” అని ఆమె పోలీసులను ప్రశ్నించారు.
ప్రియాంక గాంధీతోపాటు పార్టీ నాయకులు దీపేందర్ సింగ్ హుడా తదితరులు ఉన్నారు. లఖీంపూర్‌లో ఉద్రిక్తత ఉండడంతో గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. దాంతో ప్రియాంక గాంధీ సైతాపూర్‌లోని హర్‌గావ్ సరిహద్దుకు వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు.
ప్రియాంక నిర్బంధం తర్వాత ఆమె సోదరుడు రాహుల్ గాంధీ “వారు నీ ధైర్యాన్ని చూసి భయపడుతున్నారు” అని ట్వీట్ చేశారు. “ప్రియాంక నీవు వెనక్కి తగ్గవని నాకు బాగా తెలుసు. వారు నీ ధైర్యానికి భయపడుతున్నారు. ఈ అహింసాయుత పోరులో దేశ రైతులు తప్పక గెలిచేలా మేము చూస్తాం” అని కూడా రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
प्रियंका, मैं जानता हूँ तुम पीछे नहीं हटोगी- तुम्हारी हिम्मत से वे डर गए हैं।
न्याय की इस अहिंसक लड़ाई में हम देश के अन्नदाता को जिता कर रहेंगे। #NoFear #लखीमपुर_किसान_नरसंहार
— Rahul Gandhi (@RahulGandhi) October 4, 2021