Monday, January 20, 2025

‘బలగం’ సినిమాలో నటించిన టీచర్‌కు సన్మానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ‘బలగం’ సినిమాలో నటించిన వృత్తివిద్యా ఉపాధ్యాయ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు భిక్షమయ్యను పిఆర్‌టియుటిఎస్ నేతలు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర వృత్తివిద్యా ఉపాధ్యాయ సంఘ సమావేశం సోమవారం పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి,బీరెల్లి కమలాకర్‌రావు, ఎంఎల్‌సి కూర రఘోత్తం రెడ్డిలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పిఆర్‌విటియుటిఎస్ రాష్ట్ర వృత్తివిద్యా ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా గొడిశల శ్రీనివాస్, పోతిగంటి వెంకట్‌రెడ్డి తిరిగి ఎన్నుకయ్యారు. రాష్ట్ర వృత్తివిద్యా ఉపాధ్యాయ సంఘ సలహాదారుగా ఓ. శంకరయ్యను ఎన్నికున్నారు. పిఆర్‌విటియుటిఎస్ వృత్తివిద్యా ఉపాధ్యాయులకు 1990 అక్టోబర్ 30 నుంచి సర్వీసు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ద్వారా జి.ఒ. ఇప్పిస్తామని పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ఈ సందర్భంగా తెలిపారు. వృత్తివిద్యా ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నామని కూర రఘోత్తం రెడ్డి పేర్కొన్నారు.

PRTU 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News