Monday, January 20, 2025

బిజెపి పై పోరాటానికి ఖమ్మంలో అడుగులు పడ్డాయి : పంజాబ్ సిఎం భగవంత్ మాన్

- Advertisement -
- Advertisement -

ఖ‌మ్మంలో జ‌రిగిన బిఆర్ఎస్ భేరీలో పంజాబ్ సిఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు. స‌భ‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ  ప్రపంచంలోనే యువశక్తి ఎక్కువగా ఉన్నది భారత్ లోనే , కానీ భారతదేశంలోనే యువకులకు ఉద్యోగాలు లేవని ముఖ్యమంత్రి అన్నారు. కంటి వెలుగు ఎంతో ప్ర‌భావంత‌మైన ప‌థ‌క‌మ‌న్నారు. స‌భ‌కు వ‌చ్చిన జ‌నం చూస్తుంటే అద్భుతంగా ఉంద‌ని, ఏవైనా ప్ర‌త్యేక కండ్ల అద్దాలు త‌యారు చేసి ఉంటే, ఇంత జ‌నాన్ని ఆ అద్దాల నుంచి చూసేవాడిని అంటూ భ‌గ‌వంత్ అన్నారు.

బిజెపి దేశాన్ని తప్పు దారి పట్టిస్తొందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చడమే బిజెపి పని అని భగవంత్ మాన్ ఎద్దేవ చేశారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని బిజెపి అపహస్యం చేసిందన్నారు.  ఈ దేశం రంగు రంగుల పూల స‌మాహారం, కానీ ఒకే పువ్వు ఉండాల‌ని కొంద‌రు చూస్తున్నార‌ని ఆయ‌న బిజెపిపై విమ‌ర్శ‌లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News