Friday, November 22, 2024

బిసి కులగణనపై ఫిబ్రవరి రెండో వారంలో బిసి మేధావుల సమావేశం

- Advertisement -
- Advertisement -

త్వరలోనే బిసి నిపుణుల కమిటీ ఏర్పాటు
కులగణనపై అధ్యయనానికి బిహార్, ఏపిల పర్యటన
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సమగ్ర కులగణన చేపట్టడానికి అసెంబ్లీలో చర్చించి చట్టం చేయాలనే ఆలోచనలో ఉందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో బిసిల తరఫున ప్రభుత్వానికి పలు సూచనలు సలహాలు ఇవ్వడానికి, భవిష్యత్తులో కులగణనపై న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ఉండటానికి ఫిబ్రవరి రెండో వారంలో హైదరాబాదులో బిసి మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మేధావుల సమావేశానికి రాష్ట్రంలోని రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులను, రిటైర్డ్ ఐఎఎస్ లను ఐపిఎస్ లను, ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, మేధావులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో కులగణన నిర్వహించేంత వరకు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలతో పాటు కులగణను పర్యవేక్షించడం కోసం, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటం కోసం పటిష్టంగా కార్యాచరణ రూపొందించదానికిని పుణుల కమిటీని వేయనున్నట్లు జాజుల తెలిపారు. ఇప్పటివరకు కులగణన నిర్వహించిన బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మేధావులు, నిపుణుల కమిటీతో పర్యటించి సమగ్రమైన విధానాన్ని రూపొందిస్త్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించి బిసి రిజర్వేషన్లు 42 శాతం పెంచే వరకు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించవద్దని, ఉద్యోగాల నోటిఫికేషన్ లు కూడా విడుదల చేయరాదని జాజుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత మేర లోక్ సభ ఎన్నికల ముందే కులగణన చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News