Sunday, January 19, 2025

బెంగళూరును బీట్ చేస్తున్నాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/శామీర్‌పేట: బెం గళూరుతో పోల్చితే హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. గురువారం నగరంలో జీనోమ్ వ్యాలీలో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ న్యూ క్యాంపస్‌కు భూమిపూజ చేసి రాష్ట్రంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా డెవలప్ చేశామని తెలిపారు. మంచి రాజకీయ నాయకులతో మంచి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కంపెనీ విస్తరణ కోసం ఎవరి వెం ట తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకు న్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్‌కు హబ్ గా మా రిందన్నారు. గత రెండేండ్లుగా తెలంగాణలో లైఫ్ సైన్స్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. యూరప్‌తో పోలిస్తే ఇండియాలో లేబ ర్ ఛార్జీలు చాలా తక్కువ అని తెలిపారు. త్వరలో లైఫ్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు. ఏడున్నర ఎకరాల్లో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ కంపెనీ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కంపెనీ హైదరాబాద్‌లో రూ. 788 కోట్ల పెట్టుబడులు పెడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కంపెనీ  ద్వారా 1000 మందికి ఉపాధి లభించనుంది. లైఫ్ సైన్సెస్ రంగాల్లో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ ముఖ్యమైన కంపెనీ అని పేర్కొన్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో హైదరాబాద్ లైఫ్ సైన్స్ రంగం మరింత ముందుకు వెళ్తుందన్నారు. సింజీన్ విస్తరణ మన రాష్ట్రం అందించే అద్భుతమైన అవకాశాలు నిదర్శమన్నారు. జీనోవ్ వ్యాలీ మార్గదర్శక జీవన విజ్ఞాన కార్యకలపాలను ప్రారంభించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయక వ్యవస్ధలను సులభతరం చేయడం లక్షంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీని విస్తరణ అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడం, పెంపొందించడం ఆవిష్కరణలను ప్రొత్సహిస్తుందన్నారు. జీనోమ్ వ్యాలీ లైప్ సైన్సెస్, బయోటెక్నాలజీకి గ్లోబల్ హబ్‌గా ఉద్భవించిందని ప్రముఖ పరిశోధనా సంస్ధలు, బయోటెక్ కంపెనీలు ప్రతిభావంతులైన నిపుణులను ఒకేదగ్గరి చేర్చిందన్నారు. జీనోమ్ వ్యాలీలో సింజీన్ ప్రస్తుత పరిశోధన సదుపాయం 2020లో 52వేల చదరపు అడుగులు ఉండగా ప్రస్తుతం దాని విస్తీర్ణం నాలుగు రేట్లు పెరిగి 20 వేల చదరపు అడుగులకు విస్తీర్ణంలో 900 మంది శాస్త్రవేత్తలను కలిగి ఉందన్నారు. ఈకార్యక్రమంలో ఐటీ కార్యదర్శి జయేష్‌రంజన్, ప్రభుత్వ కార్యదర్శి వెంకట నర్సింహ్మారెడ్డి, ఎండీ నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.

మరో ఫార్మా కేంద్రం ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో కంపెనీ పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి లోని జీనోమ్ వ్యాలీలో కెమో ఇండియా ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపస్‌లో తొలిసారిగా ఒలిగో న్యూక్లి యోటైడ్స్ క్యాన్సర్ చికిత్స మందుల కేంద్రాన్ని రాష్ట్రపంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News