Monday, December 23, 2024

బెజవాడ బాబాయ్ హోటల్ లో సందడి చేసిన వెంకీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైంధవ్ సినిమాలో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్నారు. వెంకటేశ్‌కు 75వ సినిమా కావడంతో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. విక్టరీకి హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుండగా సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తుండగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ విజయవాడలో సందడి చేశారు.

డిసెంబర్ 11న మధ్యాహ్నం వివిఐటి కాలేజీలో, కెల్‌యు యూనవర్సిటీ విద్యార్థుల మధ్య సైంధవ్ మూవీలోని ఓ సాంగ్ విడుదల చేయనున్నారు. వెంకటేశ్ కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్న తరువాత టిఫిన్ చేసేందుకు బాబాయ్ హోటల్‌ఉ వచ్చారు. అభిమానులు, స్థానికులు వెంకటేశ్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అంతకుముందు విక్టరీ బస్సులో కూడా జర్నీ చేసి ప్రయాణికులతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్‌ద్దీఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలో నటిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News